Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకీ కుడుముల చేతుల మీదుగా 'జ‌మాన' టైటిల్ ప్రోమో రిలీజ్!

Jamana movie update
Advertisement
  • యూత్ ఫుల్ ఎంటర్టయినర్ గా 'జమాన'
  • దర్శకుడిగా భాస్కర్ జక్కుల పరిచయం 
  • హీరోగా సూర్య శ్రీనివాస్ ఎంట్రీ
  • డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నట్టుగా వెల్లడి

Advertisement
ఇటీవల కాలంలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బ‌లం ఉన్న‌ చిన్న సినిమాలకు కూడా ప్రేక్ష‌కులు పెద్ద‌ విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవ‌లోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌ట్టే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`. 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కల్యాణ్ `బ్రో` సినిమాతో సుప‌రిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండ‌గా శ్రీ ల‌క్ష్మీ వ‌ల్ల‌భ క్రియేష‌న్స్, విఎస్ అసోసియేట్స్ బ్యానర్స్ పై  తేజస్వి అడప మరియు బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్క‌ర్ జ‌క్కుల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోను ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ .. "జ‌మాన టైటిల్ ప్రోమో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన‌ సూర్య శ్రీ‌నివాస్, సంజ‌య్‌కి ఆల్ ది బెస్ట్‌. డైరెక్ట‌ర్ భాస్క‌ర్ జ‌క్కుల విజ‌న్ బాగా న‌చ్చింది" అన్నారు. హీరో సూర్య శ్రీ‌నివాస్ మాట్లాడుతూ "మేం అడ‌గ‌గానే వెంట‌నే మా జ‌మాన టైటిల్ ప్రోమోను విడుద‌ల చేసిన వెంకీ కుడుములగారికి థ్యాంక్స్‌...ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్‌. ఆయ‌న చేతుల మీదుగా విడుద‌లైన మా 'జ‌మాన' సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందని న‌మ్మ‌కం ఉంది. మా డైరెక్ట‌ర్ భాస్క‌ర్ గారికి మంచి విజ‌న్ ఉంది. నేటి యువ‌త‌కు సంబందించి ఒక అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రానికి తెర‌కెక్కించారు" అని  అన్నారు.

ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ జ‌క్కుల మాట్లాడుతూ - 'జ‌మాన' టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన ద‌ర్శ‌కులు వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్‌. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ లో యూత్ కి నచ్చే విధంగా జమాన చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఫ‌స్ట్ మూవీ అయినా యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ మంచి స‌పోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ క‌థ‌ని న‌మ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌..త్వ‌ర‌లోనే మ‌రో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌తో మీ ముందుకు వ‌స్తాం' అన్నారు.

Advertisement
Advertisement
Jamana
Surya Srinivas
Bhaskar
Venky Kudumula

More Telugu News